శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (12:11 IST)

అపుడు అత్యాచారం చేశాడు.. ఇపుడు తాళి కట్టాడు...

అపుడు అత్యాచారం చేసిన నిందితుడే ఇపుడు జైల్లో తాళి కట్టాడు. ఈ వింత ఘటన ఒడిషా రాష్ట్రంలోని ఓ సబ్‌జైలులో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... సుందర్ ఘడ్ జిల్లా కుడాయికల గ్రామానికి చెందిన ఓ యువతి గత ఏడాది

అపుడు అత్యాచారం చేసిన నిందితుడే ఇపుడు జైల్లో తాళి కట్టాడు. ఈ వింత ఘటన ఒడిషా రాష్ట్రంలోని ఓ సబ్‌జైలులో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... సుందర్ ఘడ్ జిల్లా కుడాయికల గ్రామానికి చెందిన ఓ యువతి గత ఏడాది జులై నెలలో తన బంధువు పెళ్లికి వెళ్లి బహిర్భూమి కోసం బయటకు వెళ్లింది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన ప్రమోద్ పాత్ర యువతిని పొదల్లోకి బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ కేసులో జైలు కెళ్లిన ప్రమోద్ పాత్ర మనసు మార్చుకొని పశ్చాతాపంతో తాను అత్యాచారం చేసిన యువతినే జైలు అధికారులు, రెండు కుటుంబాల బంధువులు, మిత్రుల సమక్షంలో మూడు మూళ్లు వేసి పెళ్లాడాడు. తాళి కట్టే ముందు యువతికి ప్రమోద్ క్షమాపణలు చెప్పడం విశేషం. కాగా, ఈ కేసు తుది తీర్పు కోసం నిందితుడు ఎదురు చూస్తున్న తరుణంలో ఈ పెళ్లి జరగడంతో ఈ నిందితుడు కేసు నుంచి బయటపడే అవకాశం ఉంది.