మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 26 జనవరి 2019 (16:22 IST)

కొడనాడు మర్డర్.. పళనిసామికి ఊరట.. వేదనిలయం జప్తు

తమిళనాడు మాజీ సీఎం జయలలితకు చెందిన కొడనాడ్ ఎస్టేట్‌లో అక్కడి గార్డ్ ఓమ్ బహదూర్ (40) అనుమానస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో పశనిస్వామికి సంబంధం వుందంటూ ఇటీవల ఓ మ్యాగజైన్ విడుదల చేసిన వీడియో క్లిప్ ఆధారంగా సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఎస్టేట్ హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఆయన పిటిషన్‌లో కోరారు. ఈ కేసు విషయమై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. రామస్వామి వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. 
 
ఇదిలా ఉంటే దివంగత సీఎం జయలలిత పోయెస్ గార్డెన్‌ నివాసం వేద నిలయం జప్తులో వుంది. వేదనిలయంతో పాటు ఆమెకు చెందిన నాలుగు స్థిరాస్తులు ఆదాయం పన్ను శాఖ జప్తులో వున్నాయి. 
 
అన్నాశాలైలోని ఒక వాణిజ్య సదుపాయం, చెన్నై, సెయింట్ మేరీస్ రోడు లోని మరో ఆస్థి, హైదరాబాద్‌, శ్రీనగర్ కాలనీలో ఉన్న భవనం 2007 నుంచి తమ జప్తు కింద ఉన్నాయని  ఆదాయం పన్ను శాఖ న్యాయవాది ఎ.పి శ్రీనివాస్ కోర్టుకు పేర్కొన్నారు.
 
ఆదాయం పన్ను బకాయిలు కట్టనందుకు ఈ ఆస్తులను జప్తు చేయాల్సివచ్చిందని ఐటీశాఖ న్యాయవాది కోర్టుకు తెలిపారు. 1990-91 నుంచి 2011-12 ఆర్ధిక సంవత్సరాల వరకూ జయలలిత పన్ను బకాయిలు వడ్డీతో కలిపి రూ.10.12 కోట్ల వరకు వున్నాయని శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు.