శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 8 నవంబరు 2017 (15:27 IST)

పరీక్షలు వాయిదా వేయించాలని.. విద్యార్థిని చంపిన స్టూడెంట్

పాఠశాలలో నిర్వహించే పరీక్షలను వాయిదా వేయించేందుకు ఓ విద్యార్థి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇందుకోసం సహచర స్టూడెంట్‌ను హతమార్చాడు. దీంతో సెప్టెంబర్ 8వ తేదీన ఢిల్లీ స్కూల్‌లో జరిగిన మర్డర్ కేసులో కొత్త కోణం

పాఠశాలలో నిర్వహించే పరీక్షలను వాయిదా వేయించేందుకు ఓ విద్యార్థి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇందుకోసం సహచర స్టూడెంట్‌ను హతమార్చాడు. దీంతో సెప్టెంబర్ 8వ తేదీన ఢిల్లీ స్కూల్‌లో జరిగిన మర్డర్ కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. 
 
రియాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఏడేళ్ల బాలుడు హత్యకు గురైన ఘటనకు సంబంధించి సీబీఐ పోలీసులు షాకింగ్ న్యూస్ బయటపెట్టారు. రెండో తరగతి చదువుతున్న ప్రద్యూమన్ థాకూర్‌ను తన సీనియర్ హత్య చేశాడని తేల్చారు. పదకొండో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి.. స్కూల్ పరీక్షలు వాయిదా వేయించాలన్న ఉద్దేశంతో ప్రద్యూమన్‌ను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. 
 
సెప్టెంబర్ 8న ప్రద్యూమన్ స్కూల్ బాత్రూంలో శవమై కనిపించాడు. అతని గొంతు కోసి ఉంది. రక్తపుమడుగులో ఉన్న ఆ చిన్నారి శవాన్ని మొదట స్కూల్ గార్డనర్ గుర్తించాడు. రియాన్ స్కూల్ ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీబీఐ పోలీసులు దాన్ని చేధించారు. ఈ కేసులో డ్రైవర్‌ను అశోక్‌ను మొదట విచారించి అరెస్టు చేశారు. 
 
అయితే మరింత లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు మరో స్టన్నింగ్ అంశాన్ని గుర్తించారు. పేరెంట్ టీచర్ మీటింగ్‌ను, ఎగ్జామ్స్‌ను రద్దు చేయించాలన్న ఉద్దేశంతోనే 11వ తరగతి చదువుతున్న విద్యార్థి.. చిన్నారి ప్రద్యూమన్‌ను హత్య చేసినట్లు సీబీఐ పోలీసులు తేల్చారు. అయితే సీసీటీవీ ఫూటేజ్ ప్రకారం డ్రైవర్ అశోక్‌కు ఈ కేసుతో సంబంధం లేదని తేల్చారు.