శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 డిశెంబరు 2022 (11:17 IST)

భారత్ జోడో యాత్ర: రాజస్థానీ మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిన ప్రియాంక గాంధీ

priyanka gandhi
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర రాజస్థాన్ చేరింది. సోమవారం బుండీ జిల్లా నుండి "భారత్ జోడో యాత్ర" పునఃప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, వారి కుమార్తె సోదరుడు, పార్టీ ఎంపీ రాహుల్ గాంధీతో చేరారు.
 
మహిళా సాధికారత సందేశాన్ని ప్రచారం చేయడం కోసం పార్టీ కార్యకర్తలు, సమీప జిల్లాల నుండి వందలాది మంది మహిళలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలతో చేరారు. 
 
ఈ వీడియోలో, ప్రియాంక రాజస్థానీ మహిళలతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించింది.ఈ వీడియో వైరల్‌గా మారింది. 3,570 కిలోమీటర్ల యాత్ర ప్రధాన లక్ష్యం భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడమేనని ప్రియాంకా గాంధీ తెలిపారు.