బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 డిశెంబరు 2022 (18:17 IST)

రాహుల్ గాంధీ మంచి మనసు.. ముగ్గురు బాలికలను హెలికాప్టర్‌లో..?

Rahul gandhi
Rahul gandhi
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంచి మనసును చాటుకున్నారు. ముగ్గురు బాలికలను హెలికాఫ్టర్‌లో తీసుకెళ్లి వారి కోరికను నెరవేర్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా నవంబర్ 29న ఉజ్జయినిలో రాహుల్ పర్యటిస్తున్నారు. ఈ సమయంలో సీతల్ పటిదార్ అనే ఏడో తరగతి చదువుతున్న హాలిక, 10వ తరగతి విద్యార్థిని అంతిమా పన్వర్, గిరిజ పన్వర్ కలిశారు. 
 
ఓ సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా  వీరు తమను పరిచయం చేసుకున్నారు. వారి కలలు, ఆకాంక్షలు చదువుల గురించి ఆ సందర్భంలో రాహుల్  అడిగి తెలుసుకున్నారు. తాము రాహుల్‌తో కలిసి హెలికాప్టర్ రైడ్ చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. త్వరలోనే దీన్ని సాధ్యం చేస్తానని అప్పుడు మాటిచ్చారు. 
 
ఇచ్చిన మాటను ప్రస్తుతం నిలబెట్టుకున్నారు. దానిని ఎట్టకేలకు హెలికాప్టర్‌లో ఎక్కించుకుని టెక్నికల్ విషయాలను పైలట్‌తో కలిసి రాహుల్ వివరించారు. వారికి చాక్లెట్లు ఇచ్చారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.