శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 జులై 2023 (17:53 IST)

రాజస్థాన్‌లో ఘోరం-తండ్రీ-కుమార్తెల మృతి

train
రాజస్థాన్‌లో ఘోరం జరిగింది. అబురోడ్ రైల్వే స్టేషన్‌లో దారుణం చోటుచేసుకుంది. కిక్కిరిసిన రైలు నుంచి 35 ఏళ్ల వ్యక్తి, అతడి ఐదేళ్ల కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. 
 
పాలి జిల్లాలోలని ఫల్నాకు వెళ్లేందుకు భీమారావు తన భార్య, కవలలతో కలిసి అబురోడ్ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. 
 
కిక్కిరిసి వున్న సబర్మతి- జోధ్‌పూర్ ప్యాసింజర్ రైలులో కూతురు మోనికతో కలిసి భీమారావు ఎక్కుతుండగా, బ్యాలెన్స్ తప్పి ఇద్దరూ కిందపడిపోయారు. 
 
ఈ ప్రమాదంలో తండ్రీకుమార్తె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.