సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 జూన్ 2023 (15:17 IST)

వేరే కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించింది.. కన్నతండ్రే చంపేశాడు..

crime scene
వేరే కులానికి చెందిన అబ్బాయిని ప్రేమిస్తున్న కుమార్తెను కన్నతండ్రి హత్య చేసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. కర్ణాటకలోని కోలారు జిల్లాలోని బంగారుపేట సమీపంలోని కామసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే... బోడగుర్కి గ్రామానికి చెందిన కీర్తీ (20) అనే యువతిని ఆమె తండ్రి కృష్ణమూర్తి గొంతుకోసి హత్య చేశాడు. ఈ విషయం తెలిసి అదే గ్రామానికి చెందిన కీర్తి ప్రియుడు గంగాధర్ అనే యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
గంగాధర్, కీర్తి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న కీర్తి తండ్రి ఆగ్రహానికి లోనైయ్యాడు. కానీ కీర్తి మాత్రం తండ్రి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఇంటి నుంచి పారిపోయి గంగాధర్‌ను పెళ్లి చేసుకోవడాని సిద్దం అయ్యారు. 
 
దీంతో తండ్రీకూతుళ్ల మధ్య జరిగిన మాటల వాగ్వాదం తారాస్థాయికి చేరింది. ఇదే సమయంలో సహనం కోల్పోయిన తండ్రి అతని కూతురు కీర్తి గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.