శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 జూన్ 2023 (17:49 IST)

ప్రభుదేవా కుమార్తె పేరు నయనతార?

prabhudeva
ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా 1995లో రమాలతాను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత నయనతారతో ప్రేమలో వుండి ఆపై ఆమెకు దూరం అయ్యాడు. 
 
కరోనా కాలంలో ముంబైలో ఫిజియోథెరపిస్ట్ హిమానీ సింగ్‌తో ప్రభుదేవా స్నేహం చేశాడు. అది తరువాత ప్రేమగా మారింది. ఆ తర్వాత ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. 
 
ఈ నేపథ్యంలో ప్రభుదేవా, హిమానీ సింగ్‌లు ఏప్రిల్‌లో తిరుపతి ఆలయాన్ని సందర్శించిన ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. 
 
తాజాగా ఈ దంపతులకు అందమైన పాప పుట్టింది. ప్రభుదేవా కుటుంబంలో పుట్టిన మొదటి ఆడబిడ్డ కావడంతో కుటుంబమంతా హ్యాపీగా వుంది. 
 
అయితే ఇప్పుడు ఆమె కూతురి పేరు నయనతార అనే వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాపిస్తోంది. అయితే ఇది పూర్తిగా తప్పుడు వార్త అని ప్రభుదేవా స్నేహితుల వర్గాల సమాచారం.