శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 జూన్ 2023 (11:25 IST)

నాలుగోసారి తండ్రి అయిన ప్రభుదేవా.. రెండో భార్యకు..?

Prabhu Deva
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు ప్రభుదేవా నాలుగోసారి తండ్రి అయ్యాడు. 50 ఏళ్ల ప్రభుదేవా రెండో భార్య హిమానీ సింగ్ ఆ పాపాయికి జన్మనిచ్చారు. ప్రభుదేవా తన మాజీ భార్య రమాలతతో ముగ్గురు కుమారులకు తండ్రి అయ్యాడు. 
 
అయితే, వారి కుమారుడు 2008లో మరణించాడు. ప్రభుదేవా 2011లో రమాలతతో విడాకులు తీసుకున్న తర్వాత నయనతారతో కొంతకాలం ప్రేమాయణం సాగించాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. కానీ వారు విడిపోయారు. 
 
అటు పిమ్మట ప్రభుదేవా ముంబై ఫిజియోథెరపిస్ట్ హిమానీ సింగ్‌ను ప్రేమించి 2020లో వివాహం చేసుకున్నాడు. హిమానీ ఇటీవల ఒక కుమార్తెకు జన్మనిచ్చింది.
 
ప్రభుదేవా డ్యాన్సర్, కొరియోగ్రాఫర్‌గా ప్రారంభించారు. శంకర్ 'ప్రేమికుడు'తో నటుడిగా మారాడు. 2005లో "నువ్వొస్తానంటే నేనొద్దంటానా"తో దర్శకుడిగా మారాడు. తెలుగు, హిందీ, తమిళంలో డజనుకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించాడు.