1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated: గురువారం, 25 మే 2023 (12:37 IST)

సుపారీ ఇచ్చి తండ్రిని హత్య చేయించిన కుమార్తె..

crime scene
సుపారీ ఇచ్చి తండ్రిని హత్య చేయించింది కూతురు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాగ్‌పూర్ జిల్లాకు చెందిన 60 ఏళ్ల వ్యక్తికి భార్య, కూతురు ఉన్నారు. అయితే అతను మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని నిత్యం భార్యను, కూతురిని వేధించసాగాడు. దీంతో విసిగిన కూతురు తండ్రిని అంతమొందించేందుకు పథకం పన్నింది. 
 
దీనిలో భాగంగా తండ్రి హత్యకు స్థానికంగా ఓ కాంట్రాక్ట్ కిల్లర్‌కి రూ.5 లక్షలకు బేరం కుదుర్చుకుంది. మే 17న నాగ్‌పూర్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న భివాపూర్‌లోని తమ పెట్రోల్ పంపు వద్ద కాంట్రాక్ట్‌ కిల్లర్‌, అతని అనుచరులు ఆమె తండ్రిని కత్తితో పొడిచి పరారయ్యారు. మృతుడి కుమార్తె సుపారీ ఇచ్చి హత్య చేయించిన విషయం బయటపెట్టడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.