బుధవారం, 11 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 మార్చి 2023 (08:17 IST)

యూట్యూబ్‌లో చూసిన ప్రసవం చేసుకున్న బాలిక.. ఆ తర్వాత శిశువును...

YOUTUBE
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణం జరిగింది. గర్భవతి అయిన ఓ బాలిక యూట్యూబ్‌లోని వీడియోలను చూసి ప్రసవం తనకుతానుగా చేసుకుంది. ఆ తర్వాత పుట్టిన బిడ్డను గొంతునులిమి హత్య చేసింది. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో శారీరకంగా దగ్గర కావడంతో ఆ బాలిక గర్భందాల్చింది. ఆ తర్వాత ఇంట్లోనే యూట్యూబ్‌లో చూస్తూ కాన్పు చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని అంబజారీ ప్రాంతానికి చెందిన ఓ బాలికకు సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ పరిచయం కాలక్రమంలో మరింతగా బలపడింది. ఈ క్రమంలో వారిద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. ఫలితంగా బాలిక గర్భందాల్చింది. కుమార్తెకు పొట్ట పెరుగుతుండటాన్ని గమనించిన కన్నతల్లి.. నిలదీయడంతో అనారోగ్యం కారణంగా పొట్ట పెరుగుతుందని తల్లిని కూడా బురిడీ కొట్టింటింది. 
 
ఆ తర్వాత యూట్యూబ్‌లో ప్రసవానికి సంబంధించిన వీడియోలను చూసిన ఆ బాలిక.. ఒంటరిగానే కాన్పు చేసుకోవచ్చనచి తెలుసుకుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 2వ తేదీన ఎవరూ లేని సమయంలో ఆడబిడ్డకు ఆ బాలిక జన్మనిచ్చింది. ఆ వెంటనే శిశువును గొంతు నులిమి హత్య చేసి, ఇంట్లో పెరట్లో మృతదేహాన్ని పాతిపెట్టింది. కుమార్తె నీరసంగా ఉండటాన్ని గమనించిన తల్లి... గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పింది. ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు బాలిక ఇంటికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.