భర్త తారకరత్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న అలేఖ్యారెడ్డి
నటుడిగా మారిన రాజకీయ నాయకుడు, 39 ఏళ్ల నందమూరి తారక రత్న ఆకస్మిక మరణం ఆయన కుటుంబ సభ్యులను, అభిమానులను విషాదంలో ముంచెత్తింది. 23రోజుల పాటు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
తన 40వ పుట్టినరోజుకు ముందు బెంగళూరులోని హృదలాలయా ఆసుపత్రిలో శనివారం మరణించాడు. మంచి మనిషిగా, అంకిత భావంతో కూడిన తండ్రిగా, ప్రేమగల భర్తగా ఆయనను ఎరిగిన చాలామందికి ఆయన మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించింది.
తారకరత్న మృతి చెందిన నేపథ్యంలో ఆయన సతీమణి అలేఖ్య భావోద్వేగానికి గురై ఆయన గురించిన జ్ఞాపకాలను పంచుకున్నారు.
అతను ఒక అద్భుతమైన తండ్రి, భర్త, స్నేహితుడిగా.. తన కుటుంబానికి ఎలా ప్రాధాన్యత ఇస్తాడో ఆమె గుర్తుచేసుకుంది. తన 40వ పుట్టినరోజు సందర్భంగా, అలేఖ్య కొన్ని మరపురాని కుటుంబ ఫోటోలను పంచుకుంది. అవి వైరల్‌గా మారాయి.