శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 19 జూన్ 2023 (16:05 IST)

యువకుడిని ప్రేమించిన కుమార్తె.. చంపేసిన కన్నతండ్రి.. ఎక్కడ?

murder
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన మనసుకు నచ్చిన యువకుడిని ప్రేమించిన కుమార్తెతో ఆమె ప్రియుడిని కూడా కన్నతండ్రి కర్కశంగా చంపేశాడు. ఈ పరువు హత్య మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మొరేన్ జిల్లా రతన్ బసాయి గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ గ్రామానికి చెందిన శివాణి (18) అనే యువతి సమీప గ్రామానికి చెందిన రాధేశ్యామ్ తోమర్ (21) అనే యువకుడిని గత కొంతకాలంగా ప్రేమిస్తుంది. ఈ విషయం శివాణి తండ్రి రాజ్‌పాల్‌కి తెలిసింది. అంతే.. ఆమెతో పాటు ఆమె ప్రియుడిని కూడా కర్కశంగా చంపేశాడు. మృతదేహాలను ఎవరికీ కనిపించకుండా చంబాల్ నదిలో పడేశాడు. ఆ తర్వాత జూన్ మూడో తేదీన తమ కుమార్తె కనిపించలేదంటూ తల్లి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. 
 
తండ్రి మాత్రం ఏమీ తెలియనట్టుగా ఉండిపోయాడు. దీంతో అనుమానం వచ్చి ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడించాడు. పైగా, మృతదేహాలు పడేసిన ప్రాంతాన్ని కూడా చూపించాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.