మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 అక్టోబరు 2023 (12:25 IST)

సోదరుడిపై ట్రాక్టర్‌తో ఎనిమిదిసార్లు తొక్కించి చంపేశారు.... ఎక్కడ?

tractor
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ భూవివాదం కేసులో వరుసకు సోదరుడైన వ్యక్తిపై ట్రాక్టరుతో ఎనిమిది సార్లు తొక్కించి చంపేశారు. ఈ దిగ్భ్రాంతికర ఘటన భరత్‌పూర్ జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
భరత్‌పూర్‌లోని బయానా ప్రాంతానికి చెందిన బహదూర్ సింగ్ గుర్జర్, అతర్ సింగ్ గుర్జర్ కుటుంబాల మధ్య ఓ స్థలం విషయంలో వివాదం నడుస్తోంది. బుధవారం బహదూర్ కుటుంబ సభ్యులు ఆ స్థలాన్ని దున్నేందుకు ట్రాక్టర్‌తో వచ్చారు. ఈ విషయం తెలిసి అతర్ సింగ్ కుటుంబ సభ్యులూ అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ మొదలైంది. 
 
ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ గొడవలో అతర్ సింగ్ కుటుంబానికి చెందిన నిర్పత్ నిరసనగా నేలపై పడుకోగా, బహదూర్ కుటుంబానికి చెందిన వ్యక్తి ట్రాక్టరుతో దూసుకొచ్చాడు. అక్కడున్నవారు అడ్డుకునే ప్రయత్నం చేసినా ట్రాక్టరుతో వెనక్కి ముందుకు 8 సార్లు తొక్కించాడు. దాంతో నిర్పత్ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు, నిందితుడు వరుసకు సోదరులవుతాడు. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడితో పాటు అతని కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.