బుధవారం, 29 నవంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2023 (20:20 IST)

ఆస్కార్ అవార్డుకు బలగం, దసరా..?

Dilraju-Balagam movie
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులకు తెలుగు మూవీ కూడా వెళ్లనుంది. గత ఏడాది భారత్ తరఫున పంపిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ రావడంతో జ్యూరీ ప్రస్తుతం భారత సినిమాలను వడబోసి ఆస్కారుకు పంపే పనిలో పడింది. 
 
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు, ఎలిఫెంట్ విస్పర్స్ డాక్యుమెంటరీకి అస్కార్ రావడంతో జ్యూరీ ఈసారి కూడా సత్తా ఉన్న మూవీలను ఎంపిక చేస్తోంది. తెలంగాణ గ్రామీణ మానవసంబంధాలను వెండితెరపై భావోద్వేగంతో చూపి ఇప్పటికే పలు అవార్డులను కొల్లగొట్టిన జబర్దస్త్ వేణు చిత్రం ‘బలగం’ మూవీని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
నాని హీరోగా నటించిన రస్టిక్ మూవీ ‘దసరా’ను కూడా జ్యూరీ మదింపు వేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు సహా మొత్తం 22 చిత్రాలు ఎంపికకు వచ్చాయని ఇందులో ఒక సినిమాను ఎంపిక చేయడం కష్టంతో కూడుకున్న పని అంటూ టాక్ వస్తోంది.