ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 31 డిశెంబరు 2017 (09:44 IST)

రాజకీయాల్లోకి వస్తున్నా: తలైవా రజనీకాంత్ ప్రకటన

తమిళనాడులో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. ఎన్ని సంవత్సరాల పాటు ఊరిస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. మార్పు కోసమే తాను రాజకీయాల్లో వస్తున్నానని ప్రకటించారు. తమిళ రాష్ట్ర

తమిళనాడులో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. ఎన్ని సంవత్సరాల పాటు ఊరిస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. మార్పు కోసమే తాను రాజకీయాల్లో వస్తున్నానని ప్రకటించారు. తమిళ రాష్ట్ర ప్రజలకు మేలు చేసేందుకు కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లు తెలిపారు.

అలాగే తమిళనాట పాగా వేసేందుకు, సూపర్ స్టార్ రజనీకాంత్ మద్దతు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి ఆయన షాక్ ఇచ్చారు.
 
రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించిన రజనీకాంత్... ఢిల్లీ రాజకీయాలపై కూడా విమర్శలు గుప్పించారు. దేశ రాజకీయాలు నాశనమయ్యాయంటూ పరోక్షంగా బీజేపీ, కాంగ్రెస్‌లపై ధ్వజమెత్తారు. రాజులు దండయాత్ర చేసి దోచుకుంటున్నట్టు... ప్రస్తుత రాజకీయ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంత సులువు కాదని ఆయన అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆధ్యాత్మిక పాలన అందిస్తానని చెప్పారు. పార్టీ ఏర్పాటులో అభిమాన సంఘాలదే కీలక పాత్ర రజనీకాంత్ స్పష్టం చేశారు. 
 
చెన్నైలో అభిమానుల సమావేశంలో రజనీకాంత్ మాట్లాడుతూ, డబ్బు కోసమో, పేరు కోసమో తాను రాజకీయ పార్టీ పెట్టడం లేదని స్పష్టం చేశారు. కావాల్సినంత డబ్బు, పేరు ప్రఖ్యాతులు ఇప్పటికే తనకుఉన్నాయని చెప్పారు. ఇప్పటికీ తాను రాజకీయాల్లోకి రావడం అనవసరమేనని... కానీ రావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు