ఈ నెల 19న రాజ్యసభ ఎన్నికలు
కరోనా వైరస్ కారణంగా 18 రాజ్యసభ స్థానాలకు జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలను జూన్ 19న నిర్ణయించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.
19న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. వెంటనే ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఏపీలో మొత్తం నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
వైసీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి ఒకరు ఎన్నికల బరిలో నిలిచారు. గుజరాత్ లో నాలుగు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మూడు చొప్పున, జార్ఖండ్ లో రెండు మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 55 స్థానాలు ఖాళీ అవగా... వాటిలో 37 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.