రేప్ కేసు.. జైలులోనే బాధితురాలికి ఖైదీతో పెళ్ళి.. బాబు పుట్టడంతో కథ సుఖాంతం..
రేసు కేసులో శిక్షను అనుభవిస్తున్న ఓ ఖైదీ చివరకు అత్యాచార బాధితురాలినే వివాహం చేసుకున్న ఘటన పురూలియా జైలులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మనోజ్ బౌరీ (30) అనే వ్యక్తిని 2010లో పోలీసులు అరెస్ట్ చేశార
రేసు కేసులో శిక్షను అనుభవిస్తున్న ఓ ఖైదీ చివరకు అత్యాచార బాధితురాలినే వివాహం చేసుకున్న ఘటన పురూలియా జైలులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మనోజ్ బౌరీ (30) అనే వ్యక్తిని 2010లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ అమ్మాయిని అతను రేపే చేయడం ద్వారా ఆమెకు ఓ అబ్బాయి జన్మించాడు. కుమారుడు పుట్టిన రెండు నెలలకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
తన కుమారుడిని స్కూల్లో చేర్పించాలంటే తండ్రి స్థానంలో ఎవరి పేరును చేర్చాలని పోలీసులను ప్రశ్నించడంతో నిందితుడి పోలీసులు అరెస్ట్ చేశారు. మనోజ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టగా, అతనికి కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ సందర్భంగా బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని మనోజ్ కోర్టుకు తెలిపాడు. కోర్టు కూడా అంగీకారం తెలపడంతో... ఇద్దరి పెళ్లి జైలులో జరిగింది. సమస్య పరిష్కారం కావడంతో, త్వరలోనే మనోజ్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.