శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 మార్చి 2021 (14:32 IST)

అత్యాచార బాలికను.. నిందితుడుని కట్టేసి ఊరేంతా తిప్పారు.. ఎక్కడ

సాధారాణంగా అత్యాచారానికి పాల్పడిన వారిని శిక్షించడం ఆనవాయితీ. ఇలాంటి కిరాతక చర్యలకు పాల్పడే వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించడం ఆనవాయితీ. కానీ ఇక్కడ మాత్రం అత్యాచారానికి గురైన బాలికతో పాటు.. అత్యాచారం చేసిన నిందితుడిని కట్టేసి ఊరంతా తిప్పారు. ఈ దారుణం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌కు సమీపంలో చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భోపాల్‌కు 400 కిలోమీటర్ల దూరంలోని అలీరాజ్‌పూర్ జిల్లాలో గిరిజనలు అధికంగా నివసించే ఓ ప్రాంతంలో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ గిరిజన ప్రజలు... ఆ నిందితుడిని పోలీసులకు పట్టించాల్సింది పోయి.. అతనితోపాటు అత్యాచారానికి గురైన మైనర్ బాలికను కట్టేసి, నినాదాలు చేస్తూ ఊరంతా తిప్పారు. 
 
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, పోలీసులు రంగంలోకి దిగి నిందితుడితో పాటు మరో ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆ వీడియో క్లిప్‌లో 'భారత్ మాతా కి జై' అంటూ కొంతమంది వ్యక్తులు నినాదాలు చేయడంతో పాటు సదరు యువతిని నిందితుడితో పాటు తిప్పినట్లుగా కనిపిస్తుంది. 
 
ఇక ఆమెను అలా నిందితుడితో ఊరంతా నడిపించడంలో సదరు యువతి కుటుంబసభ్యుల ప్రోద్భలం కూడా ఉందని సమాచారం. పోలీసులు సమాచారం అందుకుని ఘటనాస్థలానికి చేరుకొని యువతిని రక్షించారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై, యువతి కుటుంబ సభ్యులు, గ్రామస్తులపై కేసులు పెట్టి విచారిస్తున్నామని స్థానిక పోలీసులు వెల్లడించారు.