శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 9 జనవరి 2018 (16:06 IST)

అత్యద్భుతం : సహారా ఎడారిని కప్పేసిన మంచు దుప్పటి (వీడియో)

ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారిగా పేరుగాంచిన సహారా ఎడారిని మంచుదుప్పటి కప్పేసింది. ఇది చూపరులను మంత్రమగ్ధులను చేస్తోంది. ఇప్పటికే ఉత్తర అమెరికా, కెనడా దేశాలు మంచు తుఫానులో కూరుకునిపోయిన విషయం తెల్సిందే.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారిగా పేరుగాంచిన సహారా ఎడారిని మంచుదుప్పటి కప్పేసింది. ఇది చూపరులను మంత్రమగ్ధులను చేస్తోంది. ఇప్పటికే ఉత్తర అమెరికా, కెనడా దేశాలు మంచు తుఫానులో కూరుకునిపోయిన విషయం తెల్సిందే. ఈ మంచు తుఫాను ధాటికి పదుల సంఖ్య మరణాలు కూడా సంభవించాయి. ఇపుడు ఈ హిమఖడ్గం సహారా ఎడారిని కూడా వదిలిపెట్టలేదు.
 
ఎర్రటి ఇసుకతిన్నెలన్నీ మంచుతో కప్పబడి, ధ్రువ ప్రాంతాలను తలపిస్తున్నాయి. గత 37 సంవత్సరాల్లో ఇలా జరగడం ఇది నాలుగోసారి. సహారాకు గేట్ వేగా పిలువబడే ఆల్జీరియాలోని ఐన్ సెఫ్రా పట్టణానికి సమీపంలో ఉన్న ఎడారిలో మంచు కురిసింది. కొన్ని ప్రాంతాల్లో 16 అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. వాతావరణంలో నెలకొన్న అసమానతల వల్లే మంచు కురిసిందని వాతావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.