విమానంలో తన్నుకున్న పైలెట్లను ఉద్యోగం నుంచి పీకేశారు
భూమికి కొన్నివేల అడుగుల ఎత్తులో వెళుతున్న విమానంలో ప్రయాణికులను గాలికి వొదిలి తన్నుకున్న ఇద్దరు పైలెట్లను జెట్ విమానయాన సంస్థ తొలగించింది. ఈనెల ఒకటో తేదీన లండన్ నుంచి ముంబై వెళుతున్న విమానం ప్రయాణంలో
భూమికి కొన్నివేల అడుగుల ఎత్తులో వెళుతున్న విమానంలో ప్రయాణికులను గాలికి వొదిలి తన్నుకున్న ఇద్దరు పైలెట్లను జెట్ విమానయాన సంస్థ తొలగించింది. ఈనెల ఒకటో తేదీన లండన్ నుంచి ముంబై వెళుతున్న విమానం ప్రయాణంలో ఉండగానే సీనియర్ పైలెట్ ఒకరు ఓ మహిళా కమాండర్‌ను చెంపమీద కొట్టడంతో ఘర్షణ మొదలైంది.
ఈ గొడవ ముదిరి పరస్పరం కొట్టుకునే వరకు వెళ్లడంతో మిగతా సిబ్బంది కలగజేసుకుని విమానం క్షేమంగా ల్యాండ్ అయ్యేలా చూశారు. దీంతో విమానంలోని ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో జెట్ సంస్థ విచారణకు ఆదేశించింది. దీనిపై ఆ సంస్థ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ, "2018 జనవరి 1న లండన్ నుంచి ముంబై వస్తున్న 9డబ్యూ 119 విమానంలో జరిగిన వివాదానికి కారణాలను సమీక్షించాం. ఆ ఇద్దరు కాక్‌పిట్ సిబ్బందిని తక్షణమే ఉద్యోగంలో నుంచి తొలగించాలని జెట్ ఎయిర్‌వేస్ నిర్ణయించింది" అని వెల్లడించారు.