మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 4 జనవరి 2018 (11:21 IST)

ఫ్లైట్‌ను గాలికి వదిలేసి.. కాక్‌పిట్‌లో తన్నుకున్న పైలట్లు

కొందరు పైలట్లు క్షణికావేశానికి లోనవుతుంటారు. ఇలాంటివారి వల్ల విమాన ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

కొందరు పైలట్లు క్షణికావేశానికి లోనవుతుంటారు. ఇలాంటివారి వల్ల విమాన ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా ఇద్దరు పైలట్లు తాము నడుపుతున్న ఫ్లైట్‌ను గాలికి వదిలేసి కాక్‌పిట్‌లో ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కొత్త సంవత్సరం రోజైన జనవరి ఒకటో తేదీన జెట్ ఎయిర్‌వేస్ విమానం 324 మంది ప్రయాణికులతో లండన్ నుంచి ముంబై బయలుదేరింది. సమాచార మార్పిడిలో లోపం కారణంగా కాక్‌పిట్‌లోని పైలట్ల మధ్య వివాదం తలెత్తింది. తొలుత చిన్నగా మొదలైన వాగ్వాదం చివరికి బాహాబాహీకి దారి తీసింది. 
 
ఈ ఇద్దరు పైలట్లు విమానాన్ని పట్టించుకోకుండా ఘర్షణకు దిగడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. అయితే కాసేపటికే పైలట్ల మధ్య వివాదం సమసిపోయింది. ప్రయాణికులంతా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకున్నారు. పైలట్లు గొడవకు దిగడం నిజమేనని జెట్ ఎయిర్‌వేస్ ధ్రువీకరించింది. ఘర్షణకు దిగిన ఇద్దరు పైలట్లను విధుల నుంచి తాత్కాలికంగా తప్పించి, విచారణకు ఆదేశించినట్టు పేర్కొంది.