ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 14 డిశెంబరు 2017 (11:49 IST)

చెరువులో పడిన జింకను ఇలా కాపాడారు?

మంచుతో గడ్డకట్టుకుపోయిన నీటితో కూడిన చెరువులో ఓ జింక చిక్కుకుపోయింది. ఆ చెరువు నుంచి తప్పించుకునేందుకు జింక నానా తంటాలు పడింది. అయితే భద్రతా సిబ్బంది ఆ జింకను కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్త

మంచుతో గడ్డకట్టుకుపోయిన నీటితో కూడిన చెరువులో ఓ జింక చిక్కుకుపోయింది. ఆ చెరువు నుంచి తప్పించుకునేందుకు జింక నానా తంటాలు పడింది. అయితే భద్రతా సిబ్బంది ఆ జింకను కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఒరెగాన్‌లో ఓ జింక పిల్ల గడ్డకట్టుకుపోయిన చెరువు మధ్యలో చిక్కుకుపోయింది. 
 
అయితే బయటకు వచ్చేందుకు ఆ జింక నానా తంటాలు పడింది. చివరికి అగ్నిమాపక సిబ్బందికి చెందిన ఓ వ్యక్తి ఆ జింకను కాపాడాడు. గడ్డకట్టుకుపోయిన చెరువులో జింక నడిచేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. కాలు ముందుకు వేయ‌గానే జారి ప‌డిపోయింది. ఇలా అనేకసార్లు ప్ర‌య‌త్నించింది. చివరికి దాన్ని కాపాడారు. ఈ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను మీరూ ఓ లుక్కేయండి.