ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 4 జనవరి 2017 (10:43 IST)

52కిలోల బరువున్న డ్రెస్సర్‌ కింద పడిపోయిన రెండేళ్ల బాలుడు.. కాపాడిన కవల సోదరుడు (Video)

డ్రెస్సర్ కింద ఓ బాలుడు చిక్కుకుపోయాడు. అయితే తన కవల సోదరుడిని రక్షించాడు. ఏమాత్రం భయపడకుండా సాఫీగా తన సోదరుడిని కాపాడి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ ఘటన అమెరికాలోని యూటాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే

డ్రెస్సర్ కింద ఓ బాలుడు చిక్కుకుపోయాడు. అయితే తన కవల సోదరుడిని రక్షించాడు. ఏమాత్రం భయపడకుండా సాఫీగా తన సోదరుడిని కాపాడి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ ఘటన అమెరికాలోని యూటాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బ్రోక్‌, బౌడీషోఫ్‌ ఇద్దరూ కవల సోదరులు. వారిరువురు గదిలో ఆడుకుంటున్న సమయంలో డ్రెస్సర్‌ పైకి ఎక్కే ప్రయత్నం చేశారు. అది కాస్త బ్రోక్‌ మీద పడిపోయింది. దీంతో అతడు దానికింద చిక్కుకుపోయాడు. 
 
బాధతో విలవిల్లాడుతున్న బ్రోక్‌ను చూసిన బౌడీషోఫ్‌... సోదరుడిని ఎలాగైనా కాపాడాలనుకున్నాడు. ఏం చేయాలో చాలాసేపు తికమక పడి సోదరుడిని రక్షించడానికి శతవిధాలా ప్రయత్నించాడు. చివరకు 52 కిలోల బరువున్న డ్రెస్సర్‌ను పక్కకు నెట్టి తన సోదరుడిని కాపాడుకోగలిగాడు. ఈ విషయం ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూడా తెలియదు. గదిలో ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాన్ని చూసి తాను షాక్ అయ్యానని, బాధకు గురయ్యానని చిన్నారుల తల్లి హెలీఫ్‌ షోఫ్‌ తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.