బుధవారం, 5 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2016 (21:00 IST)

జయలలిత స్థానంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిని నియమించాలి : ఎంకే.స్టాలిన్

అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి జయలలిత స్థానంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మరొకరిని నియమించాలని ప్రతిపక్ష నేత, డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు.

అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి జయలలిత స్థానంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మరొకరిని నియమించాలని ప్రతిపక్ష నేత, డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. 
 
కావేరి నిర్వహణ బోర్డు ఏర్పాటును వ్యతిరేకిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఖండిస్తూ స్టాలిన్ నేతృత్వంలో శుక్రవారం తంజావూరులో డీఎంకే నిరాహార దీక్ష చేపట్టింది. దీక్ష అనంతరం స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జయలలిత మరికొంత కాలం ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు స్పష్టంచేశారు. 
 
అందువల్ల ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని, కావేరి జలాల వివాదం పరిష్కారానికి, ప్రభుత్వ కార్యక్రమాల సక్రమ నిర్వహణకు అనువుగా అన్నాడీఎంకే పార్టీలో సీనియర్‌ నేతను ఉప ముఖ్యమంత్రిగానో లేక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగానో నియమించాల్సిన అవసరం ఉందన్నారు. 
 
అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి వీలైనంత త్వరగా కోలుకోవాలని డీఎంకే పార్టీ, తమ అధ్యక్షుడు కరుణానిధి కోరుకుంటున్నారని, ఆమె ఆరోగ్య పరిస్థితులను రాజకీయం చేయదలచుకోలేదని మీడియా ప్రశ్నకు స్టాలిన్ బదులిచ్చారు.