సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 మార్చి 2024 (18:52 IST)

విదర్భలో రూ.27కోట్ల నగదు.. 17లక్షల లీటర్ల లిక్కర్ స్వాధీనం

Money
విదర్భలోని 5 లోక్‌సభ స్థానాలకు మార్చి 20 నుంచి నామినేషన్ల దాఖలుతో తొలి దశ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా, రాష్ట్ర ఎన్నికల అధికారులు పోలీసుల సహకారంతో రూ.27 కోట్ల నగదు, 17 లక్షల లీటర్ల లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నారు. 
 
మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి భారీ లీటర్ల మద్యం, 699 కిలోల డ్రగ్స్, 43 కిలోల విలువైన లోహాలు స్వాధీనం చేసుకున్నారు. రూ.27 కోట్లలో రూ.3.60 కోట్లు ముంబై శివారు ప్రాంతంలోనే పట్టుబడ్డాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎస్ చొక్కలింగం తెలిపారు. 
 
అయితే, స్వాధీనం చేసుకున్న నగదు అంతా చట్టవిరుద్ధం కాదని, అందువల్ల పోలీసు ఆర్థిక నేరాల విభాగంలో వెంటనే ఎటువంటి నేరం నమోదు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.