శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 4 మే 2019 (14:52 IST)

రాహుల్ 15 యేళ్లుగా ఎంపీ... బ్రిటన్ పౌరుడైతే అనుమతిస్తారా? శ్యామ్ పిట్రోడా

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఆ పార్టీ ఓవర్సీస్ చీఫ్ శ్యామ్ పిట్రోడా కొట్టిపారేశారు. సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ పోటీ చేస్తున్నది ఇది తొలిసారికాదన్నారు. గత 15 యేళ్లుగా రాహుల్ లోక్‌సభ సభ్యుడుగా ఉంటూ అందరి సభ్యుల్లాగే పార్లమెంట్‌ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నారని ఆయన గుర్తుచేశారు. గత దశాబ్దన్నర కాలంలోరాని అనుమానం ఇపుడే ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. 
 
పైగా, బీజేపీ నేతలు చేస్తున్న తప్పుడు ఆరోపణలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. బీజేపీ నేతలు చేస్తున్న తప్పుడు ఆరోపణలకు మోసపోవడానికి ప్రజలేమైనా అమాయకులనుకుంటున్నారా..? ప్రజలకు అన్నీ తెలుసు, వారిని తక్కువ అంచనా వేయవద్దని పిట్రోడా హెచ్చరించారు. 
 
ప్రతిసారి ప్రజలను మోసం చేయాలకుంటే కుదరదన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు మీకు బుద్ధి చెబుతారన్నారు. రాహుల్ పౌరసత్వంపై అనుమానాలు ఉంటే 15 ఏళ్లలో ఎప్పుడైనా అడిగి ఉండవచ్చ. కానీ ఎన్నికలకు రెండు వారాల ముందు అడగడంలో మీ అంతరార్థం ఏమింటో ప్రజలు గ్రహిస్తారని శ్యామ్ పిట్రోడా అన్నారు.