Daily Horoscope
✕

ఐజేకేతో పొత్తు.. ఏఐఎస్ఎంకే వ్యవస్థాపకుడు శరత్ కుమార్..

Written By సెల్వి
Updated: శనివారం, 27 ఫిబ్రవరి 2021 (12:28 IST)
అసెంబ్లీ ఎన్నికల్లో ఇందియా జననాయగ కట్చితో (ఐజేకేతో) పొత్తుపెట్టుకుని కూటమిగా బరిలో దిగుతామని తమిళనాడుకు చెందిన పాతతరం నటుడు, ఆలిండియా సమతువ మక్కల్ కట్చి (ఏఐఎస్ఎంకే) వ్యవస్థాపకుడు శరత్ కుమార్ వెల్లడించారు. 
 
మంచి పేరు, నడవడిక ఉన్న వారినే మా కూటమి తరఫున బరిలో దించుతామని ఆయన చెప్పారు. ఇప్పటివరకు శరత్‌కుమార్ పార్టీ అధికార అన్నాడీఎంకే కూటమిలో భాగస్వామిగా ఉన్నది. అటు ఐజేకే సహవ్యవస్థాపకుడు పారివెందర్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే గుర్తుతో పోటీచేసి విజయం సాధించారు.
 
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ రెండు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడటం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, తాము మరికొన్ని చిన్నపార్టీలను కలుపుకునే ప్రయత్నంలో ఉన్నామని శరత్‌కుమార్ తెలిపారు. 
 
తాను కమల్ హాసన్‌ను కూడా కలిసి పొత్తు విషయమై మాట్లాడానని, తన ప్రతిపాదనపై ఎలా ముందుకు వెళ్లాలనేది వాళ్లు నిర్ణయించుకుంటారని చెప్పారు. మేం మాత్రం వారు త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని శరత్‌కుమార్ అభిప్రాయపడ్డారు.

అన్నీ చూడండి

రాజా సింగ్‌ను కలిసిన దేవి విజ్ఞానం హిందీ చిత్ర బృందం, డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల

మనిషి పశువు అయితే.. జంగా గ్లింప్స్ ను విడుదల చేసిన రాంగోపాల్ వర్మ

క్యాస్టింగ్ కౌచ్.. అపుడూ వుంది.. ఇపుడూ వుంది.. బాటిళ్లలో మూత్ర విసర్జన చేశాం...: రమ్యకృష్ణ

రెండో పార్ట్ తో పాటు రీ రిలీజ్ ఐడియా విశ్వక్ సేన్ దే : సురేష్ బాబు

పూజా రెడ్డి ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ చిత్రం వ్యూ సిద్ధమైంది

తర్వాతి కథనం
Show comments