అమ్మకు తర్వాత చిన్నమ్మే సీఎం.. జయకు తర్వాత శశికళ.. జోరుగా ప్రచారం..!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీకి ప్రజలు పట్టం కట్టిన సంగతి తెలిసిందే. దీంతో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సీఎం పదవిని అలంకరించారు. అయితే అమ్మకు తర్వాత అన్నాడీఎంకే వారసులు ఎవరనేదానిపై ప
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీకి ప్రజలు పట్టం కట్టిన సంగతి తెలిసిందే. దీంతో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సీఎం పదవిని అలంకరించారు. అయితే అమ్మకు తర్వాత అన్నాడీఎంకే వారసులు ఎవరనేదానిపై ప్రస్తుతం తమిళనాడులో చర్చ సాగుతోంది. సీఎం జయలలితకు తర్వాత ఆమె స్థానంలో రాజకీయాల్లో రాణించేందుకు పలుకుబడి గల వ్యక్తులు లేరనే లోటున్నప్పటికీ.. తాజాగా అమ్మకు తర్వాత శశికళ (చిన్నమ్మ) అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
అమ్మకు తర్వాత ఆమె వీరవిధేయుడు మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వంకు అన్నాడీఎంకే పార్టీ నాయకత్వ బాధ్యతలు ఇచ్చేందుకు జయలలిత భావిస్తున్నప్పటికీ.. శశికళను ఆ పార్టీకి వారసులు చేయాలనే ఒత్తిడి, ప్రచారం ఎక్కువవుతోంది. దీనికోసం చిన్నమ్మ పేరుతో కొత్త పార్టీని స్థాపించడం జరిగిపోయింది.
శివగంగైకి ఎ.ఎల్. చిన్నతంబి అనే వ్యక్తి శశికళను సీఎంగా చూడాలన్నదే తన లక్ష్యమంటున్నారు. అమ్మకు తర్వాత చిన్నమ్మ శశికళను 2021వ సంవత్సరం సీఎంగా చేస్తామంటున్నారు. మరి శశికళకు అన్నాడీఎంకే పగ్గాలు ఇవ్వడంపై జయమ్మ సానుకూలంగా స్పందిస్తారో లేకుంటే సీరియస్ అవుతారో తెలియాలంటే వేచి చూడాలి.