గురువారం, 13 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : గురువారం, 11 ఆగస్టు 2016 (12:29 IST)

ఈ సెల్ఫీకి రూ.25వేల ఫైన్.. కోబ్రా పిల్లతో సెల్ఫీ.. వెయ్యి రూపాయలకు అమ్ముతాడట!

వెర్రి వేయి రకాలు. పిచ్చి ముదిరి తలకు రోకలి చుట్టుకోవడం అంటే ఇలాగేనేమో! స్మార్ట్ ఫోన్స్ వాడుకలో వచ్చాక ప్రతి యొక్కరు సెల్ఫీ పిచ్చిలో మునిగితేలుతున్నారు. కుర్రకారు రోజూ కనీసం ఒక సెల్ఫీ తీయకుండా నిద్రపో

వెర్రి వేయి రకాలు. పిచ్చి ముదిరి తలకు రోకలి చుట్టుకోవడం అంటే ఇలాగేనేమో! స్మార్ట్ ఫోన్స్ వాడుకలో వచ్చాక ప్రతి యొక్కరు సెల్ఫీ పిచ్చిలో మునిగితేలుతున్నారు. కుర్రకారు రోజూ కనీసం ఒక సెల్ఫీ తీయకుండా నిద్రపోరని ఇటీవలే నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. తాజాగా ఓ సెల్ఫీ పిచ్చోడు కోబ్రా పిల్లతో సెల్ఫీ దిగి పాతిక వేల రూపాయలను ఫైన్‌గా కట్టాడు.
 
ఆ వివరాలను పరిశీలిస్తే... గుజరాత్‌లోని వడోదరకు చెందిన బిల్డర్ యశేష్ బరోత్ అనే యువకుడు చిన్న గాజు సీసాలో ఉన్న త్రాచు పిల్లతో సెల్ఫీ దిగాడు. అంతటితో ఆగకుండా దానిని తన సోషల్ మీడియా పోస్ట్ చేసి.. దానిని వెయ్యి రూపాయలకు అమ్ముతానని క్యాప్షన్ పెట్టాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఆ పోస్టుకు కొన్ని లక్షల లైకులు వచ్చాయి. అలాగే లక్షల మంది దానిని విమర్శించారు కూడా. 
 
సాధారణ నెటిజన్లతో పాటు దానిని జంతుసంరక్షణా అధికారులు కూడా వీక్షించారు. ఇంకేముందీ... వారు ఈ విషయాన్ని అటవీ అధికారులకు చేరవేశారు. అధికారులు ఊరుకుంటారా...ఆ యువకుడిని పట్టుకుని అరెస్టు చేసి పాతిక వేల రూపాయల జరిమానా విధించారు. ఆ త్రాచుపిల్లని జంతుసంరక్షణా కార్యకర్తలు స్వాధీనం చేసుకున్నారు. అదీ సంగతి సెల్ఫీ కోసం సాహసాలు చేస్తే ఇలాంటి జరిమానాలు కట్టక తప్పదు. యూత్ తస్మాత్ జాగ్రత్త!