మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 11 మార్చి 2019 (11:17 IST)

బంధువే ఏడేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు.. ఆపై హత్యకూడా..

మహిళలపై వయోబేధం లేకుండా అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నప్పటికీ.. కేంద్రం కఠినమైన చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తుంది. కఠినమైన చట్టాలుంటేనే మహిళలపై దారుణాలను అరికట్టవచ్చునని మహిళా సంఘాలు ఎంత డిమాండ్ చేసినా.. కేంద్రం పట్టించుకోవట్లేదు. తాజాగా పంజాబ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఓ కిరాతకుడు, ఆపై ఆమెను హత్య చేశాడు. బాలిక బంధువే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. దొరహా పట్టణంలో బాలిక బంధువు ఆమెను అపహరించి.. ఆమెను సమీపంలోని గోదాముకు తీసుకెళ్లాడు. 
 
అక్కడ తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఆ చిన్నారిని దారుణంగా హత్యచేసి పరారయ్యాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో వున్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.