'నా మొహం సినిమాకు పనికిరాదు... నాకు కాంపౌండర్ అయ్యే అర్హతే లేదు.. ఆరోగ్య మంత్రిని అయ్యా' : శత్రుఘ్నసిన్హా
బాలీవుడ్ సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు శత్రుఘ్న సిన్హా ఆత్మకథ 'ఎనీథింగ్ బట్ కామోష్' పుస్తకం బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ఇందులో ఆయన అనేక ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. నాకు కాంపౌండర్ అయ్యే అర్హ
బాలీవుడ్ సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు శత్రుఘ్న సిన్హా ఆత్మకథ 'ఎనీథింగ్ బట్ కామోష్' పుస్తకం బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ఇందులో ఆయన అనేక ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. నాకు కాంపౌండర్ అయ్యే అర్హతే లేదు.. ఆరోగ్య మంత్రిని అయ్యాయని ఆయన గుర్తుచేశారు.
ఆదివారం జరిగిన బ్రహ్మపుత్ర లిటరరీ ఫెస్టివల్ సందర్భంగా శత్రుఘ్న సిన్హా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తన జీవితానికి సంబంధించిన అన్ని విషయాలనూ అందులో నిజాయితీగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్టు తెలిపారు.
నిజానికి 'నా మొహం సినిమాకు పనికిరాదని, సినిమాల్లో రాణించాలంటే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోమని మొదట్లో చాలామంది నాకు సలహా ఇచ్చారు. అయితే దేవానంద్ మాత్రం అలాంటి పని చేయొద్దని సూచించారు. జనాలు నన్ను.. నన్నుగానే అంగీకరించడానికి ఎంతో కష్టపడ్డాను. సినిమా నాకు ఎన్నో ఇచ్చింది.
నిజానికి, నాకు కాంపౌండర్ అయ్యే అర్హత కూడా లేదు. కానీ దేశానికి ఆరోగ్యమంత్రిని కాగలిగాను. సినిమాలను వదిలి రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయం తీసుకోవడానికి ఎంతో ఆలోచించాను. సమజానికి నా వంతుగా సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చాన'ని శత్రుఘ్న సిన్హా గుర్తు చేశారు.