శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 16 డిశెంబరు 2016 (10:30 IST)

నో కాన్వాయ్.. నో సెక్యూరిటీ.. సాధారణ పౌరుడిలా తమిళనాడు సీఎం.. ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు...

అత్యంత విషాదకర పరిస్థితుల్లో అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత వారసుడిగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ఓ పన్నీర్ సెల్వం.. అత్యంత సాదాసీదా జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

అత్యంత విషాదకర పరిస్థితుల్లో అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత వారసుడిగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ఓ పన్నీర్ సెల్వం.. అత్యంత సాదాసీదా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఆయన ఓ సాధారణ పౌరుడిలాగే నడుచుకుంటున్నారు. 
 
ముఖ్యమంత్రికి ఉండే సెక్యూరిటీ, కాన్వాయ్‌లను పూర్తిగా పక్కన పెట్టారు. పైగా.. వర్దా తుపాను తాకిడికి దెబ్బతిన్న ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తూ బాధితులను ఓదార్చుతున్నారు. దీంతో ఓ సాధారణ వ్యక్తిలా రోడ్డెక్కి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన సీఎంను చూసి వాహనదారులు అవాక్కయ్యారు.
 
వార్దా తుపాను ధాటికి దెబ్బతిన్న ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు రంగంలోకి దిగిన పన్నీర్ సెల్వం ప్రజలను మరిన్ని ఇబ్బందులకు గురిచేయడం ఇష్టం లేక కాన్వాయ్‌ను, సెక్యూరిటీని పక్కనపెట్టారు. ఈ క్రమంలో గురువారం సహాయక చర్యలను పర్యవేక్షించి తిరిగి వస్తుండగా నందనంలోని చామియర్స్ రోడ్డులో ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. 15 నిమిషాల పాటు చిక్కుకుపోయి ట్రాఫిక్ కష్టాలను అనుభవించారు. ట్రాఫిక్‌లో తమతోపాటు చిక్కుకున్న ముఖ్యమంత్రిని చూసేందుకు వాహనదారులు ఆసక్తి చూపారు.