1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 9 నవంబరు 2016 (17:38 IST)

సీఎం జయలలిత ముఖం చూడాలంటే.. 3 నెలలు వెయిట్ చేయాల్సిందేనా?

తమిళనాడు సీఎం జయలలితను చూడాలంటే.. ఇంకా మూడు నెలల కాలం పడుతుందట. సెప్టెంబర్ 22వ తేదీ డీహైడ్రేషన్‌తో చెన్నై అపోలో చేరిన జయలలితకు వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. దీంతో అమ్మ ఆరోగ్యంపై అన్నాడీఎంకే కార్య

తమిళనాడు సీఎం జయలలితను చూడాలంటే.. ఇంకా మూడు నెలల కాలం పడుతుందట. సెప్టెంబర్ 22వ తేదీ డీహైడ్రేషన్‌తో చెన్నై అపోలో చేరిన జయలలితకు వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. దీంతో అమ్మ ఆరోగ్యంపై అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. తమిళనాడులో అమ్మ ఆరోగ్యంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారని.. ఆస్పత్రిలో గల జయమ్మ ఫోటోలను విడుదల చేయాలని డిమాండ్ పెరుగుతున్నా.. అపోలో మాత్రం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. 
 
అమ్మ ముఖం చూడాలంటే ఇంకా మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు ఆస్పత్రి వర్గాల సమాచారం. 47 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత మెల్ల మెల్లగా కోలుకుంటున్నారు. ఆమెను సీసీయూ నుంచి ప్రైవేట్ రూమ్‌కు మార్చే ప్రక్రియ జరుగుతోంది. ఇంకా ఆస్పత్రిలో నెలపాటు అమ్మ ఉండాల్సి ఉంటుందని.. ఆస్పత్రి నుంచి సిరుదావూర్ బంగ్లాకు అమ్మను తీసుకెళ్తారని అక్కడ ఆమె పూర్తిగా కోలుకున్నాకే అమ్మ ముఖాన్ని ప్రజలకు చూపిస్తారని ఆస్పత్రి వర్గాల సమాచారం. 
 
చికిత్స తీసుకుంటున్న అమ్మ ఫోటోలను విడుదల చేసేందుకు వీలు పడదని 3 నెలలకు తర్వాత అమ్మ ఫోటోలను విడుదల చేయనున్నట్లు అపోలో వెల్లడించినట్లు తెలిసింది. ఇక అమ్మ త్వరలోనే అపోలో నుంచి డిశ్చార్జ్ అవుతారని అన్నాడీఎంకే వర్గాలు వెల్లడించాయి.