బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 22 ఏప్రియల్ 2017 (12:29 IST)

ఢిల్లీలో మూత్రం తాగుతామంటున్న తమిళ రైతులు, పట్టించుకోకపోతే 'పెంట' తింటాం...

తమిళనాడులో కరవు సాయం అందించాలంటూ గత 38 రోజులుగా తమిళనాడు రైతులు అనేక మార్గాల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తొలుత పుర్రెలు, చచ్చిన ఎలుకలు, పాములు పెట్టుకుని నిరసన చేసిన తమిళ రైతులు ఆమధ్య దుస్తులు విప్పేసి నగ్న నిరసన కూ

తమిళనాడులో కరవు సాయం అందించాలంటూ గత 38 రోజులుగా తమిళనాడు రైతులు అనేక మార్గాల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తొలుత పుర్రెలు, చచ్చిన ఎలుకలు, పాములు పెట్టుకుని నిరసన చేసిన తమిళ రైతులు ఆమధ్య దుస్తులు విప్పేసి నగ్న నిరసన కూడా చేశారు. తాజాగా మరో నిరసనకు తెర తీసారు. కేంద్రం స్పందించనందుకు వారంతా మూత్రం తాగుతామని హెచ్చరిస్తున్నారు. శనివారం నాడు ఈ రకంగా తమ నిరసనను వెల్లడించారు. 
 
ఐనప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆదివారం నాడు పెంట తింటామంటూ సంచలనాత్మక ప్రకటన చేశారు. ఆదివారం దాకా డెడ్ లైన్ విధించిన రైతులు తమ డిమాండ్లను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్న ఈ రైతులు ప్రతి ఒక్కరి ముందు మూత్రం నింపిన బాటిళ్లను పెట్టుకుని నిరసన తెలియజేస్తున్నారు. మరి మోదీ సర్కారు ఇప్పటికైనా ఏమయినా స్పందిస్తుందో లేదో చూడాల్సి వుంది.