ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 16 ఫిబ్రవరి 2017 (16:47 IST)

సీఎంగా పదవీ ప్రమాణం చేసిన పళని స్వామి: సోమవారం బల నిరూపణకు ముహూర్తం.. దినకరన్‌కు నో ఛాన్స్

పళని స్వామి తమిళనాడు రాష్ట్ర సీఎంగా పదవీ ప్రమాణం చేశారు. దర్భారు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో పళని స్వామితో పాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ విద్యాసాగర్ పళని స్వామిచేత సీఎంగా ప్రమాణం

పళని స్వామి తమిళనాడు రాష్ట్ర సీఎంగా పదవీ ప్రమాణం చేశారు. దర్భారు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో పళని స్వామితో పాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ విద్యాసాగర్ పళని స్వామిచేత సీఎంగా ప్రమాణం చేయించారు. గవర్నర్‌ నిర్ణయంతో శశికళ వర్గీయుల్లో హర్షం నెలకొంది.

గవర్నర్‌ ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయం తీసుకున్నారని వారు హర్ష వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గవర్నర్‌ నిర్ణయంతో పన్నీర్‌ సెల్వం వర్గంలో నిరాశ నెలకొంది. తమ బలాన్ని నిరూపించుకునేందుకు అవకాశం వస్తుందని భావించిన ఓపీఎస్‌ వర్గం గవర్నర్‌ నిర్ణయంతో షాక్‌ గురైంది.
 
ఇదిలా ఉంటే.. అన్నాడీఎంకే నేత పళనిస్వామి సోమవారం బలనిరూపణకు ముహూర్తం పెట్టుకున్నారు. బల నిరూపణకు 15 రోజుల పాటు గవర్నర్ విద్యాసాగర్ రావు సమయంలో ఇచ్చారు. కానీ పళనిస్వామి మాత్రం సోమవారమే బల నిరూపణకు రెడీ అయ్యారు. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 233 మంది సభ్యులు ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 117 మంది సభ్యులు అవసరం. పళనిస్వామికి 124 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉంది.
 
మరో ఇద్దరు, ముగ్గురు సభ్యులు పళనిస్వామికి మద్దతు పలికే అవకాశాలు కూడా ఉన్నాయి. అసెంబ్లీలో డీఎంకేకు 89 మంది సభ్యులు ఉండగా, కాంగ్రెస్‌కు 8 మంది సభ్యులే ఉన్నారు. ఐఐఎంఎల్‌కు ఉన్న ఒక్క సభ్యుడు డీఎంకేకు మద్దతు పలకనున్నారు. అంటే ప్రతిపక్ష సభ్యులు అందరూ కలిసినా 98 మందే అవుతున్నారు. వీరికి పన్నీర్ వర్గం జత కలిసి బలపరీక్షలో పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటేసినా ఆయనకు వచ్చే నష్టమేమీ లేదు.
 
ఇదిలా ఉంటే.. పళని స్వామి మంత్రుల వివరాలు గవర్నర్‌కు మంత్రులుగా ప్రమాణం చేసే వారి వివరాలను పంపించారు. ముఖ్యమంత్రి సహా 31 మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రుల జాబితాలో దినకరన్ పేరు లేదు. నలుగురు మహిళలకు మంత్రివర్గంలో చోటు దక్కింది. హోంశాఖ, ఆర్థిక శాఖను తన పళనిస్వామి తన వద్దే ఉంచుకున్నారు. మొత్తం 19 శాఖలను తన వద్ద ఉంచుకున్నారు.
 
పిడబ్ల్యూడీ శాఖ మంత్రిగా టాంగా తమిళసెల్వన్, విద్యాశాఖ మంత్రిగా అలెగ్జాండర్, చేనేత మంత్రిగా కోదండపాణి, పశుసంవర్థక శాఖ మంత్రిగా బాలకృష్ణ, సమాచార శాఖ మంత్రిగా కండబుర్ రాజు ప్రమాణం చేయనున్నారు.