1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 5 ఆగస్టు 2016 (20:01 IST)

అస్సోంలో పెట్రేగిపోయిన ఉగ్రవాదులు 14 మంది పౌరుల హతం

ఈశాన్య రాష్ట్రమైన అస్సోంలో ఉగ్రవాదులు పెట్రేగి పోయారు. రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఘటనలో 14 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 18 మంది గాయపడ్డారు. నలుగు

ఈశాన్య రాష్ట్రమైన అస్సోంలో ఉగ్రవాదులు పెట్రేగి పోయారు. రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఘటనలో 14 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 18 మంది గాయపడ్డారు. నలుగురు ఉగ్రవాదులు దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. 
 
మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆటోలో సైనిక దుస్తుల్లో వచ్చి దాడికి పాల్పడినట్లు సమాచారం. ఘటనా స్థలం నుంచి ఒక ఏకే 47 గన్‌ను స్వాధీనం చేసుకోగా, భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. 
 
ఈ ఉగ్రదాడ వార్త తెలుసుకున్న ప్రధాని మోడీ.. అస్సో సీఎం సర్బానంద్ సోనోవాల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా సీఎంతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. అస్సోంకు అదనపు పారామిలిటరీ బలగాలను కేంద్రం తరలించింది.