సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By కుమార్ దళవాయి
Last Modified: శుక్రవారం, 29 మార్చి 2019 (13:55 IST)

బ్రా మాటున బంగారం... పట్టుబడ్డ థాయ్‌లాండ్ మహిళ... ఎక్కడ?

విదేశాల నుండి అక్రమ బంగారు దిగుమతిని నియంత్రించడానికి కస్టమ్స్ శాఖ ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా రోజుకో విధంగా ఎత్తులు వేసి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. తాజాగా చెన్నైలో ఓ మహిళ బ్రా మాటున బంగారు బిస్కెట్లు పెట్టుకుని పట్టుబడింది.
 
థాయ్‌లాండ్‌కు చెందిన 38 ఏళ్ల క్రైసోర్న్ థాంప్రకోప్ అనే మహిళ టి 337 విమానంలో చెన్నైకు వచ్చింది. ఆమె వాలకం అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు ఆమెను తనిఖీ చేసారు. 47 లక్షల రూపాయల విలువైన 1.4 కిలోల బంగారాన్ని ఆమె బ్రా కింద పెట్టుకుని ఉన్నట్లు గుర్తించారు. దీనితో ఆమెను అరెస్ట్ చేసారు. 
 
ఇదే ఎయిర్‌పోర్ట్‌లో పద్మావతి అనే మహిళ తన డ్రాయర్‌లో అక్రమంగా తీసుకెళ్తున్న 12 లక్షల రూపాయల విలువైన 365 గ్రాముల బంగారాన్ని కూడా పోలీసులు పట్టుకున్నారు.