1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2016 (12:49 IST)

13 ఏళ్ల లేత అమ్మాయిలు.. కొనుక్కోండి బాబూ.. కొనుక్కోండి..!

ఆలసించినా ఆశాభంగం... 13 యేళ్ల లేత అమ్మాయిలు... కొనుక్కోండి బాబు... కొనుక్కొండి... మంచి తరుణం మించినా దొరకదు... వేలం పాటలో కొనుక్కోవచ్చు... సర్కారు వారి పాట... 30 వేలు... ఇది రాజస్థాన్‌లో ప్రస్తుతం నడు

ఆలసించినా ఆశాభంగం... 13 యేళ్ల లేత అమ్మాయిలు... కొనుక్కోండి బాబు... కొనుక్కొండి... మంచి తరుణం మించినా దొరకదు... వేలం పాటలో కొనుక్కోవచ్చు... సర్కారు వారి పాట... 30 వేలు... ఇది రాజస్థాన్‌లో ప్రస్తుతం నడుస్తున్న ఆచారం. సాధారణంగా స్త్రీని అత్యధికంగా గౌరవించే దేశాల్లో భారతదేశం ముందు స్థానంలో ఉంటుంది.
 
స్త్రీని గౌరవించాలి, పూజించాలి అని ఎంతోమంది నెత్తి నోరు బాదుకున్నా కూడా నిజానికి అవన్నీ పేపర్లకే పరిమితమవుతున్నాయి. ఈ శతాబ్దంలోను బాల్యవివాహాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు ఎంతమంది గురజాడ అప్పారావులు వచ్చినా ఇలాంటి వివాహాలను అడ్డుకోలేక పోతున్నారు. స్థోమత లేకనో.. లేదా ఇతరత్రా కారణాల వల్ల ముక్కుపచ్చలారని చిన్నారులను ఎవరో ఒకరికి అంటగట్టాలని వేలం వేసి తమ బిడ్డను అమ్మే తల్లిదండ్రులు ఇంకా ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. 
 
అందుకు నిదర్శనమే ఈ ఘటన… రాజస్థాన్‌లో జుంజును అనే చిన్న గ్రామంలో జరిగిన ఈ ఘటనను వింటే ఇలా కూడా జరుగుతుందాని ముక్కున వేలేసుకుంటారు. ముక్కుపచ్చలారని 13 ఏళ్ల చిన్నారికి పెళ్లి కూతురిలా అలంకరించి ఆమెకు పెళ్లి చేయలేదు. ఆ తల్లిదండ్రులు ఏం చేశారో తెలుసా వేలం వేసి అమ్మేశారు. దాదాపు ఎనిమిది మంది పురుషులు ఈ వేలానికి హాడరయ్యారు. ఆ వేలంలో పాల్గొన్న వారు పెళ్లి కొడుకు దుస్తులు ధరించి మరీ వచ్చారు. 
 
ఇంతకీ ఆ పెళ్లికొడుకు వయస్సు ఎంతో తెలుసా..? సుమారు 35 నుంచి 38 వరకు ఉంటారు. రూ.30 వేలతో ప్రారంభమైన చిన్నారి వేలంపాట.. చివరకు రూ.1.15 లక్షల వరకు చేరింది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే...ఎంతో రహస్యంగా గుట్టుచప్పుడు కాకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ పెద్ద మనుషులు.. చివరికి ఈ విషయం ఆ నోటా ఈ నోటా పోలీసుల దాకా చేరింది. దీంతో పోలీసులు అమ్మాయి తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు.