రైల్వే స్టేషన్ వెయిటింగ్ గదుల్లో భార్యతో ఎంజాయ్ చేస్తున్న గ్యాంగ్‌స్టర్ ఎవరు?
సాధారణంగా విచారణ ఖైదీలకు పోలీసులు చుక్కలు చూపిస్తుంటారు. ముఖ్యంగా జైలు నుంచి కోర్టుకు విచారణ నిమిత్తం తీసుకెళ్లే సమయంలో వారి చేతులకు బేడీలు వేసి.. డొక్కు వ్యానుల్లో తరలిస్తుంటారు. అదే మాఫియా డాన్ల విష
సాధారణంగా విచారణ ఖైదీలకు పోలీసులు చుక్కలు చూపిస్తుంటారు. ముఖ్యంగా జైలు నుంచి కోర్టుకు విచారణ నిమిత్తం తీసుకెళ్లే సమయంలో వారి చేతులకు బేడీలు వేసి.. డొక్కు వ్యానుల్లో తరలిస్తుంటారు. అదే మాఫియా డాన్ల విషయంలో పూర్తిభిన్నంగా ఉంటుంది. డాన్‌లు అరెస్టయినా వాళ్లకు కావాల్సిన సకలసౌకర్యాలు అందుతాయన్నది జగమెరిగిన సత్యమే. కొన్నిసార్లు జైళ్లే వారికి ఫైవ్‌స్టార్ హోటళ్లలా మారిపోతే, మరొకొన్నిసార్లు పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటారు. సరిగ్గా అలాగే చేస్తున్నాడు అండర్ ట్రయల్ గ్యాంగ్‌స్టర్ అబూ సలేం.
ప్రస్తుతం అబూ సలేం తలోజా జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నాడు. విచారణ కోసం వేర్వేరు నగరాలకు పోలీసులు తీసుకెళ్తుంటారు. ఇందులోభాగంగా, లక్నో, ఢిల్లీ వెళ్లేటప్పుడు మధ్యలో రైల్వే స్టేషన్లలోని వెయిటింగ్ రూముల్లో తన భార్యను కలిసి ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన కొన్ని అరుదైన ఫొటోలను 'మిడ్ డే' పత్రిక తాజాగా ప్రచురించింది. అబూసలేం తన భార్య సయ్యద్ బహార్ కౌసర్(26)తో పాటు పలువురు కుటుంబ సభ్యులను కూడా వెయిటింగ్ రూముల్లో కలుసుకొన్నట్టు ఈ ఫొటోల ద్వారా తెలుస్తున్నది. పైగా సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ కూడా కనిపించాడు.
అబూ సలేంను పెళ్లి చేసుకుంటానని, ఇందుకు అనుమతి ఇవ్వాలని కౌసర్ గత జూన్‌లో కోర్టును కోరారు. మధ్యలో ఒకసారి పెండ్లి చేసుకోవడం వల్ల తన జీవితం నాశనమైందని మీడియా ఎదుట ఘొల్లుమన్నారు. కానీ, తాజా ఫొటోలు చూస్తే మాత్రం ఇద్దరూ ఎంచక్కా ఎంజయ్ చేస్తున్నట్టు కనిపిస్తున్నది. వీళ్లిద్దరి వివాహం కదులుతున్న రైలులో బంధువులు, ఎస్కార్ట్ పోలీసుల సమక్షంలో జరిగినట్టు, వాళ్లే అబూసలేంకు సెల్‌ఫోన్ ఇచ్చినట్టు కథనాలు వచ్చాయి.