ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 6 అక్టోబరు 2021 (08:23 IST)

దేశవ్యాప్తంగా 15 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ

దేశవ్యాప్తంగా 15 మంది న్యాయమూర్తులను బదిలీ చేసేందుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో తెలంగాణకు ఒకరు, ఏపీకి ఇద్దరు న్యాయమూర్తులు బదిలీ కానున్నారు. బాంబే హైకోర్టు నుంచి ఉజ్జల్ భుయాన్ తెలంగాణ హైకోర్టుకు బదిలీ అవనున్నారు. పాట్నా హైకోర్టు నుంచి అహ్సానుద్దీన్ అమానుల్లాతో పాటు అలహాబాద్ హైకోర్టు నుంచి న్యాయమూర్తి రవినాథ్ తిల్హారి ఏపీ హైకోర్టుకు బదిలీ కానున్నారు.

దేశవ్యాప్తంగా 15 మంది న్యాయమూర్తులను బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫారసుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. ఆ మేరకు కేంద్ర న్యాయ శాఖ  నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ఎంఎ్‌సఎస్‌ రామచంద్రరావు పంజాబ్‌, హరియాణా హైకోర్ట్జుకు, బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు.

ఇంకా జస్టిస్‌ అనూప్‌ చిత్కారా (హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి పంజాబ్‌-హరియాణా),  జస్టిస్‌ చంద్రధారి సింగ్‌ (అలహాబాద్‌ నుంచి ఢిల్లీ), జస్టిస్‌ వివేక్‌ అగర్వాల్‌ (అలహాబాద్‌ నుంచి మధ్యప్రదేశ్‌), జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ (అలహాబాద్‌ నుంచి ఢిల్లీ), జస్టిస్‌ అనంత మనోహర్‌ బాదర్‌ (కేరళ నుంచి పట్నా), జస్టిస్‌ అరిందమ్‌ సిన్హా (కలకత్తా నుంచి ఒడిశా),

జస్టిస్‌ పీఆర్‌ ఉపాధ్యాయ్‌ (గుజరాత్‌ నుంచి మద్రాసు), జస్టిస్‌ ఎంఎం శ్రీవాస్తవ (ఛత్తీ్‌సగఢ్‌ నుంచి రాజస్థాన్‌), జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ మిశ్రా (ఒడిశా నుంచి ఉత్తరాఖండ్‌), జస్టిస్‌ సబీనా (రాజస్థాన్‌ నుంచి హిమాచల్‌), జస్టిస్‌ జశ్వంత్‌సింగ్‌ (పంజాబ్‌- హరియాణా నుంచి ఒడిశా) బదిలీలను కూడా రాష్ట్రపతి ఆమోదించారు.