శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (10:33 IST)

ఆంటీని కలిసేందుకు దినకరన్... కారు దిగితే అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ పోలీసులు... 7777 కారులో ఎస్కేప్...

టిటివి దినకరన్ నిన్న తన ఆంటీ శశికళను బెంగళూరులోని పరప్పన జైలులో కలిసి పరిస్థితిని వివరించేందుకు విశ్వప్రయత్నం చేశారు. కానీ ఆయనకు పరిస్థితులు అనుకూలించలేదని భోగట్టా. తమిళనాడు నుంచి ఆయన తన 7777 నెంబరు గల కారులో బెంగళూరుకు వెళ్లినట్లు సమాచారం.

ఈ సమాచారాన్ని అందుకున్న ఢిల్లీ పోలీసులు దినకరన్ కారు దిగితే అరెస్టు చేసేందుకు సిద్ధమైపోయారని తెలుస్తోంది. దీంతో దినకరన్ తన మేనత్త శశికళను కలిసేందుకు కూడా జంకినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ కారు దిగి అత్తను కలిసేందుకు వెళితే, మధ్యలోనే మాటు వేసి వున్న ఢిల్లీ పోలీసులు ఆయనను అరెస్టు చేస్తారనే సమాచారం అందినట్లు తెలుస్తోంది. దానితో ఆయన తన మేనత్తను జైల్లో కలవకుండానే వెనుదిరిగారు. కాగా దినకరన్ అరెస్టు చేసేందుకు ఢిల్లీ పోలీసులు చెన్నై సిటీకి చేరుకున్నట్లు చెపుతున్నారు.