సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 మార్చి 2022 (07:35 IST)

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : నేడు చివరి విడత పోలింగ్

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆఖరి, మలివిడత పోలింగ్ సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. మొత్తం 613 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 
 
ఈ దశలో అధికార భారతీయ జనతా పార్టీతో పాటు... సమాజ్ వాదీ పార్టీ భాగస్వామ్య పక్షాల మధ్య తీవ్రమైన పోటి నెలకొనివుంది. 2017లో జరిగిన జరిగిన ఎన్నికల్లో మొత్తం 54 సీట్లలకు బీజేపీ 29 సీట్లలో గెలుపొందింది. 
 
చివరి దశలో అజామ్ గఢ్, మౌ, జాన్ పూర్, ఘాజీపూర్, చందోలీ వారణాసి, మీర్జాపూర్, భదోహి, సోన్ భద్ర జిల్లాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల కోసం ప్రధాని నరేంద్ర మోడీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో మూడు రోజుల పాటు ప్రచారం చేసిన విషయం తెల్సిందే. 
 
అలాగే, ఎస్పీ అభ్యర్థుల విజయం కోసం ఆ పార్టీ అధినే అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆర్ఎల్డీ నేత జయంత్ చౌధురిలతో కలిసి ప్రచారం చేశారు. ఈ పోలింగ్ ముగిసిన తర్వాత ఈ నెల 10వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతారు.