బుధవారం, 12 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 ఫిబ్రవరి 2025 (12:12 IST)

అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఇకలేరు...

Satyendra Das
అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ (85) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తూ వచ్చారు. వీటికితోడు ఆయన షుగర్, రక్తపోటు వంటి సమస్యలు కూడా ఉండటంతో లక్నోలోని ఓ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ రాగా, ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. గురువారం ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. 
 
1992 డిసెంబరు 6వ తేదీన బాబ్రీ మసీదు కూల్చివేసిన సమయంలో సత్యేంద్ర దాస్ తాత్కాలిక రామమందిరానికి పూజారిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయనే విగ్రహాలను సమీపంలోని ఫకీర్ మందిర్‌‍కు తీసుకెళ్లారు. కూల్చివేతల తర్వాత ఆ విగ్రహాలను మళ్లీ రామజన్మభూమికి తీసకొచ్చి తాత్కాలిక మందిరంలో ఉంచారు. 
 
సత్యేంద్రదాస్ 20 యేళ్ల వయసులోని నిర్వాణి అఖాడాలో చేరి ఆధ్యాత్మిక దీక్షను తీసుకున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సం, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట సమంయలో కీలకంగా వ్యవహరంచారు. ప్రస్తుతం రామాయల ప్రధాన పూజారిగా వ్యవహరిస్తూ తుదిశ్వాస విడిచినట్టు ఆయన శిష్యుడు ప్రదీప్ దాస్ వెల్లడించారు.