శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 జులై 2021 (18:12 IST)

యూపీలో దారుణం.. భార్యను సజీవ దహనం చేసి...?

యూపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మహిళ కాలిన గాయాలతో హైవేపై పడి ఉండటం మంగళవారం ఉదయం జలౌన్ జిల్లా ఒరై ప్రాంతంలో కలకలం రేపింది. మహిళ (23)ను దయనీయ స్థితిలో చూసిన స్థానికులు ఆమెను ఝాన్సీ ఆస్పత్రికి తరలించారు. మూడు నెలల కిందట మహిళ ఓ యువకుడిని మతాంతర వివాహం చేసుకుంది. భర్త తనను సజీవ దహనం చేసేందుకు తనకు నిప్పుపెట్టాడని బాధితురాలు ఆరోపించారు. 
 
నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. బాధితురాలిని ఝాన్సీ జిల్లాలోని సెసా గ్రామానికి చెందిన ఉమగా గుర్తించారు. ఒరై ప్రాంతంలోని బజరియాకు చెందిన అరిఫ్ అనే వ్యక్తిని బాధితురాలు వివాహం చేసుకున్నారని, ఆపై భర్తతో కలిసి ఆమె నివసిస్తోందని ఏఎస్‌పీ రాకేష్ సింగ్ తెలిపారు. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నందున మరిన్ని వివరాలు వెల్లడి కాలేదని భర్తే తనకు నిప్పంటించాడని ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను నమోదు చేశామని చెప్పారు.