తల్లితో అక్రమసంబంధం.. కుమార్తె ప్రేమలో వుంది.. ఏం చేశాడంటే?
యూపీ నేరాల అడ్డాగా మారిపోయింది. అక్రమసంబంధం ఓ వ్యక్తి జీవితాన్ని బలి తీసుకుంది. తల్లితో అక్రమసంబంధం నెరిపాడు. ఆపై కూతురిని వేధించాడు. దీంతో ఆ తల్లి.. కూతురి కోసం ఆ వ్యక్తిని హతమార్చించింది. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఔరంగషాపూర్‌లో నివాసముంటున్న షమీమ్ అనే 35 ఏళ్ల మహిళ రాజీవ్ అలియాస్ రాజు అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది.
రాజీవ్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరూ ఒక వ్యవసాయ భూమిలో పనిచేస్తూ ఒకరికొకరు పరిచయం అయ్యారు. అక్కడి నుంచి ఇద్దరి మధ్య అక్రమసంబంధం మొదలైంది. షమీమ్ అనే ఈ మహిళకు ఓ కూతురు ఉంద. వ్యవసాయ పనుల్లో తల్లికి సహాయం చేసేది. ఇక షమీమ్ కూతురు మరో అబ్బాయి ముసాహిద్‌తో ప్రేమలో ఉంది.
అయితే ఇద్దరి అలా కలిసి తిరగడం రాజీవ్‌కు ఎంతమాత్రం ఇష్టం ఉండేది కాదు. వారిద్దరూ అలా తిరుగుతుండటం చూసి రాజీవ్ పలుమార్లు మందలించాడు. అయినా ఉంద పట్టించుకోలేదు. అంతే ఉందను అందరి ముందు దూషించడం.. అవమానకరంగా మాట్లాడేవాడు.
ఈ క్రమంలోనే షమీమ్‌పై కూడా రాజీవ్‌కు అనుమానం వచ్చింది. షమీమ్ ఇంకా ఎంతమంది మగవారితో సంబంధాలు నెరుపుతోందో అన్న అనుమానం ఆయనలో బలంగా నాటుకుపోయింది. ఇక రాజీవ్ ప్రవర్తనపై షమీమ్ విసుగెత్తిపోయింది. ఆయన్ను అంతమొందించాలని ప్లాన్ చేసి ఏప్రిల్ 22వ తేదీ హతమార్చించింది. రాజీవ్ చేత మద్యం తాగించి మత్తులోకి జారుకున్నాక హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.