సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 ఆగస్టు 2023 (18:59 IST)

ముఖేష్ అంబానీ ఇంట ఇండిపెండెన్స్ డే ఉత్సవాలు

Nita Ambani
Nita Ambani
భారతదేశం తన 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంది. ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం, రంగురంగుల కవాతులు, ఇతర కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. 
 
ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ కూడా 2023 స్వాతంత్ర్య దినోత్సవాన్ని తమ కుటుంబం మొత్తంతో కలిసి చాలా ఉత్సాహంగా  జరుపుకున్నారు.
 
అంబానీల ఇండిపెండెన్స్ డే వేడుకలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు బుధవారం సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. నీతా అంబానీ తన భర్త పక్కన నిలబడి జాతీయ జెండాను రెపరెపలాడిస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
Nita Ambani
Nita Ambani


కుటుంబ సభ్యులతో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. నీతా అంబానీ ఈ సందర్భంగా ఎథ్నిక్ సూట్‌ను ధరించారు. ఆమె కుమార్తె ఇషా అమాబి, కోడలు శ్లోకా అంబానీ కూడా సాంప్రదాయ దుస్తులు ధరించారు.

Nita Ambani
Nita Ambani