గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 10 ఆగస్టు 2020 (08:37 IST)

ప్లాస్మా అంటే ఏమిటి...?

రక్తం కావాలంటే వెంటనే వచ్చి ఇస్తున్నారు, ప్లాస్మా అనగానే బయపడుతున్నారు. మన రక్తంలో నీటి మాదిరిగా ఉండే పసుపుపచ్చని ఫ్లూయిడ్ నే ప్లాస్మా అంటారు.

కరోనా వంటి వైరస్ లు మన శరీరంలోకి చేరినప్పుడు వాటిని తెల్లరక్త కణాలు గుర్తించి, చంపేందుకు కావలిసిన యాంటీబాడీలు తయారవుతుంటాయి.

ఆ యాంటీ బాడీలు ప్లాస్మాలోనే ఉంటాయి. కరోనా నుంచి కోలుకున్న పేషెంట్ల ప్లాస్మా లోనూ ఈ యాంటీ బాడీలు పెద్దసంఖ్యలో తయారై ఉంటాయి. 

అందువల్ల సీరియస్ కండిషన్ లో ఉన్న పేషెంట్లకు, ఆల్రెడీ వైరస్ సోకి కోలుకున్న పేషెంట్ల ప్లాస్మాను ఎక్కిస్తే త్వరగా కోలుకుని,ప్రాణాపాయం నుండి బయటపడే చాన్స్ ఉంటుంది.