శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 1 జనవరి 2017 (13:16 IST)

విదేశాలకు పరారైన లిక్కర్ కింగ్ మోడీకి సలహాలిస్తున్నారోచ్.. రైతులు కూడా టెక్నాలజీ వాడాలా?

బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల రూపాయల రుణాలు ఎగవేసి, బ్రిటన్‌ పారిపోయి లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యాను స్వదేశానికి రప్పించాలంటూ సీబీఐ ముంబై కోర్టులో కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట

బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల రూపాయల రుణాలు ఎగవేసి, బ్రిటన్‌ పారిపోయి లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యాను స్వదేశానికి రప్పించాలంటూ సీబీఐ ముంబై కోర్టులో కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం విజయ్‌ మాల్యా అరెస్టుకు బెయిల్‌కు ఆస్కారంలేని వారెంట్‌ జారీ చేసింది.

భారత్‌-బ్రిటన్ల మధ్య కుదిరి నేరస్థుల పరస్పర మార్పడి ఒప్పందం ప్రకారం మాల్యాను స్వదేశం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ ఏడాది మార్చి 2న మాల్యా.. బ్రిటన్‌ పారిపోయారు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో నోట్ల రద్దుపై మాల్యా స్పందించారు. రైతులు కూడా టెక్నాలజీని వాడాలని చెప్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వంటి సంస్థలు సాంకేతికను వాడుకునేందుకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ, తనపై వచ్చిన ఆరోపణల్లో సాంకేతికతను వాడుకుని నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అవినీతిని అంతం చేసేందుకు కృషి చేశానని చెప్పుకునే మోదీ, తన నియంత్రణలోని సంస్థలు న్యాయబద్ధంగా, అవినీతిరహితంగా ఉండేలా చూసుకోవాలని సలహా ఇచ్చారు.