గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 15 మే 2017 (17:01 IST)

ఆర్ఎస్ఎస్‌లో చేరిన 700మంది ముస్లింలు.. పారికర్, యోగి ఎప్పుడు రాజీనామా చేస్తారు?

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. ఆదిత్యానాథ్ పనితీరుకు ముగ్ధులైన 700 మంది ముస్లింలు ఆర్ఎస్ఎస్‌లో చేరారు. ఆర్ఎస్ఎస్ పనితీరు, సిద్ధాంతాల గురించి తెలుసుకునేందుకు వీరంతా ముందుకు వచ్చ

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. ఆదిత్యానాథ్ పనితీరుకు ముగ్ధులైన 700 మంది ముస్లింలు ఆర్ఎస్ఎస్‌లో చేరారు. ఆర్ఎస్ఎస్ పనితీరు, సిద్ధాంతాల గురించి తెలుసుకునేందుకు వీరంతా ముందుకు వచ్చారని ఆ సంస్థ ప్రచారక్ మనోజ్ కుమార్ వెల్లడించారు.

వీరిలో 300 మందిని తాత్కాలిక వాలంటీర్లుగా నియమించామని, ముస్లిం యువత, ఇతర మతాలకు చెందిన ప్రజలు.. ఆరెస్సెస్‌లో చేరుతున్నారని మనోజ్ కుమార్ తెలిపారు. ఆర్ఎస్ఎస్‌పై ముస్లింల ఆలోచనాధోరణి మారిందని... అందుకే ఆర్ఎస్ఎస్‌లో చేరుతున్నారని ఆ సంస్థ కార్యకర్త అహ్మద్ తెలిపారు.
 
ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌లు ఇంకా ఎంపీలుగా కొనసాగుతూనే ఉన్నారు. త్వరలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి ఎన్నికలు ఉండటంతో వీరు ఎంపీ పదవులకు ఇంకా రాజీనామా చేయలేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కావడంతో ఎన్నికల తర్వాతే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది.